సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

16మంది ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల సస్పెన్షన్‌ను నిలిపివేసిన కేరళ హైకోర్టు

4 గంటల క్రితం

Kerala HC .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం : శంకరాచార్య యూనివర్శిటీ ఆ్‌ఫ సాంస్క్రిట్‌ (ఎస్‌ఎస్‌యుఎస్‌)కి చెందిన 16మంది ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల సస్పెన్షన్‌ ఉత్తర్వులను కేరళ హైకోర్టు నిలిపివేసింది. వారిని తిరిగి క్యాంపస్‌లోకి అనుమతించాలని, తరగతులకు హాజరయ్యేలా చూడాలని జస్టిస్‌ పి.వి.కున్హికృష్ణన్‌ యూనివర్శిటీ యాజమాన్యాన్ని సోమవారం ఆదేశించారు. సుప్రీంకోర్టుకు వారు ఇచ్చిన హామీకి అనుగుణంగా, ఆరువారాల్లోగా ఆ విద్యార్థులకు వేరుగా పరీక్ష‍లు నిర్వహించాలని పేర్కొన్నారు. అవసరమైతే యూనివర్శిటీ విద్యార్థులపై విచారణకు ఆదేశించవచ్చని, అయితే, విచారణ కొనసాగుతున్నంత కాలం వారిని సస్పెండ్‌ చేయకూడదని స్పష్టం చేసింది. తాజా విచారణను కారణంగా చూపి, ప్రత్యేక పరీక్ష‍లను ఆలస్యం చేసేందుకు వినియోగించకూడదని పేర్కొంది. తాజా విచారణలో విద్యార్థులు దోషిగా తేలితే, వారికి విధించే శిక్ష‍ను నిర్నయించేటపుడు వారు ఇప్పటికే సస్పెన్షన్‌లో గడిపిన 84 రోజులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తెలిపింది. ఆగస్టు 13న క్యాంపస్‌లో ఆందోళన చేపడుతున్న సమయంలో విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ.. 16మంది ఎస్ఎఫ్‌ఐ విద్యార్థులను యూనివర్శిటీ యాజమాన్యం సెప్టెంబర్‌ 1న సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్