శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిల్కిస్‌ బానో వ్యాఖ్యలను ఖండించిన న్యాయవాది

4 గంటల క్రితం

bilkis
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆమెకు అన్నీ తెలుసునంటూ వ్యాఖ్య

న్యూఢిల్లీ : కోర్టు ప్రొసీడింగ్స్‌ ‌గురించి తనకు తెలియచేయకుండా తనను చీకటిలో వుంచారంటూ 2002 నాటి అల్లర్ల కేసులో బాధితురాలు బిల్కిస్‌ ‌బానో చేసిన వ్యాఖ్యలను దోషుల తరపు న్యాయవాది ఆయుష్‌ ఆనంద్‌ ‌ఖండించారు. ఈ కేసులో దోషులుగా నిర్ధారించిన ఇద్దరికి సుప్రీంలో బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో బిల్కిస్‌ ‌బానో పై వ్యాఖ్యలు చేశారు. బెయిల్‌ ‌కోసం గత ఏడాదికాలంగా పదిసార్లకు పైగా అభ్యర్ధనలు దరఖాస్తు చేశామని న్యాయవాది ఆయుష్‌ చెప్పారు. బిల్కిస్‌ ‌బానో లీగల్‌‌బృందానికి ఈ ప్రొసీడింగ్స్‌ అన్నీ పూర్తిగా తెలుసునని, కానీ వారు జోక్యం చేసుకోవాలనుకోలేదని అన్నారు. ఆమె అసలు బాంబే హైకోర్టు కార్యకలాపాల్లో భాగస్వామి కాదని, కేవియట్‌ ‌కూడా దాఖలు చేయలేదని, కనీసం తనను ఈ కేసులో భాగస్వామిగా చేర్చుకోవాలని కూడా ఆమె కోరలేదని ఆయుష్‌ ఆనంద్‌ ‌పేర్కొన్నారు. దోషులుగా నిర్ధారించబడిన తన క్లయింట్లు ఇద్దరూ 17ఏళ్ళకు పైగా జైలు శిక్షను అనుభవించారని, వారి వయస్సు, అనారోగ్యం, వైకల్యం వంటి కారణాల రీత్యా వారికి బెయిల్‌ ‌రావడాన్ని సమర్ధించుకున్నారు.

మీడియా విచారణ పట్ల ఆయన హెచ్చరిస్తూ, న్యాయస్థానం పరిధిలో వున్న అంశంపై బహిరంగంగా జరిపే చర్చ తప్పుడు అభిప్రాయాలను సృష్టించరాదని లేదా న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించరాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో దోషులైన బిపిన్‌‌చంద్‌ ‌కన్హయ్యలాల్‌ జోషి, ప్రదీప్‌‌ రమణ్‌‌లాల్‌ ‌మోదియాలకు అక్టోబరు 28న సుప్రీం బెయిల్‌ మంజూరు చేయడానికి ముందుగా బిల్కిస్‌ ‌బానో తనన్యాయవాది శోభా గుప్తా ద్వారా బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. ఈ బెయిల్ గురించి తనకు తెలియచేయలేదని, తాను వినలేదని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్