శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం

1 గంట క్రితం

కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం
- పూర్తిగా తగలబడిన నాలుగు బోగీలు 
- తృటిలో తప్పించుకున్న 1500 మంది ప్రయాణీకులు  
- 8 రైళ్ల దారి మళ్లింపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 09:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పూర్తిగా తగలబడిన నాలుగు బోగీలు

- తృటిలో తప్పించుకున్న 1500 మంది ప్రయాణీకులు

- 8 రైళ్ల దారి మళ్లింపు

న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైలు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ప్రయాణిస్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొని నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. సకాలంలో గుర్తించడంతో ప్రయాణీకులందరూ రైలు దిగేశారు. వారందరిని సురిక్ష‍ితంగా బయటకు తీసుకొచ్చిన సహాయక సిబ్బంది అంబాలాకు తరలించారు. నార్తర్న్ రైల్వే అంబాలా డివిజన్ రైల్వే మేనేజర్ వినోద్ భాటియా తెలిపిన వివరాల ప్రకారం..12508 నంబరు గల రైలు అమృత్‌సర్ నుండి పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయిగురికి వెళ్తుండగా, రాజ్‌పురా స్టేషన్‌కు సమీపాన ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సరాయ్ బంజారా గ్రామం సమీపంలో బోగీ నంబర్ 1లో మొదట మంటలు కనిపించాయి. ఆ సమయంలో రైలులో సుమారు 1,500 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలట్, గార్డ్, ఇతర రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి, ప్రభావితమైన కోచ్‌ను మిగిలిన కోచ్‌ల నుండి వేరు చేశారు. ప్రభావితమైన మూడు కోచ్‌లలోని సామాను పూర్తిగా దెబ్బతిన్నది. సరాయ్ బంజారా గ్రామం సమీపంలో రైలును వెంటనే నిలిపివేసి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. మంటలను ఆర్పివేసేలోపే, అవి నాలుగు కోచ్‌లకు వ్యాపించాయి. మంటలను గమనించిన ప్రయాణీకుల్లో కొందరు భయంతో కదులుతున్న రైలు నుండి దూకడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఇద్దరుముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అగ్నిమాపక దళం రాకముందే గ్రామస్థులు ప్రయాణికులకు సహాయం చేయడానికి వచ్చారని వారు తెలిపారు. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి మరియు భయంతో ఎవరూ కోచ్‌ల నుండి దూకకుండా నిరోధించడానికి ముందుజాగ్రత్త చర్యగా ట్రాక్‌కు ఇరువైపులా రైలు రాకపోకలను నిలిపివేశారని భాటియా చెప్పారు. పాటియాలా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ హిమాన్షు అగర్వాల్, ఎస్ఎస్పి హర్మన్‌దీప్ హన్స్ కూడా అగ్నిప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రాజ్‌పురా ఎస్‌పి, డిఎస్‌పిలతో పాటు ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) లతో కూడిన పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లలో పాలుపంచుకున్నాయని హర్మన్‌దీప్‌ హన్స్ తెలిపారు. పరిస్థితి ఇప్పుడు పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రమాదాలు జరిగిన ప్రతి సారీ.. ‘కవచ్‌’ వ్యవస్థతో అత్యుత్తమ భద్రత కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గొప్పలు ప్రచారం చేసుకుంటోంది. కానీ రైల్వేలో ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడోఒకచోట ఏదో రూపంలో రైళ్లు ప్రమాదాలకు గురౌతూనేవున్నాయి. కొన్ని ఘటనల్లో ప్రాణనష్టం కూడా ఉంటోంది. రైల్వే భద్రతపై ఇప్పటికైనా మాటల గొప్పలు కాకుండా..పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్