ప్రజాశక్తి - కల్చరల్
తెలంగాణ సంస్కృతికి మూలమైన ఒగ్గు కథను చుక్కా సత్తయ్య వంశ పారంపర్యంగా కొనసాగించి తన తదుపరి తరానికి అందించి వెళ్లిపోయిన అద్భుత కళా కారుడని ప్రముఖ జర్నలిస్ట్, హాస్యావధాని శంకర నారాయణ అన్నారు. శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై గాన సభ నిర్వహణలో జరుగుతున్న ఎందరో మహానుభావులు కార్యక్రమ పరంపరలో భాగంగా చుక్కా సత్తయ్య యాదిలో సంస్మరణ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకర నారాయణ మాట్లాడుతూ, చుక్కా సత్తయ్య ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి పరిమితమైన ఒగ్గు కథను రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయస్థాయిలో నిలిపిన తెలంగాణ జానపద కళా బ్రహ్మ అని అన్నారు. బీరప్ప కథ, రేణుకా ఎల్లమ్మ కథ, మాంధాత కథ వంటి జానపద పౌరాణిక కథల్లో ఆయన ప్రదర్శించే అభినయం, బాష తెలియని వారిని సైతం ఆకట్టుకుంటుందని చెప్పారు. గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి అధ్యక్షత వహించిన వేదికపై గాయకుడు త్రినాథ రావు, సంఘ సేవకులు భవానీ ప్రసాద్, మిద్దె సురేష్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)