శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నెతన్యాహూకు షాక్

1 గంట క్రితం

నెతన్యాహూకు షాక్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఐసెన్‌ కోట్‌కు అరబ్ పార్టీల మద్దతు

- ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌క్లియర్

టెల్ అవీవ్ : ఇజ్రాయిల్‌ ‌చరిత్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు షాక్ ఇస్తూ ప్రతిపక్ష నేత గడీ ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీల నేతృత్వంలోని కూటమి మద్దతు ప్రకటించింది. దీంతో 120 స్థానాలు ఉన్న ఇజ్రాయిల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్లు అవసరం కాగా అరబ్ పార్టీల మద్దతుతో ఐసెన్‌కోట్‌కు మొత్తం 67 మంది సభ్యుల మద్దతు లభించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అరబ్ పార్టీలు 19 స్థానాలు గెలుచుకొని కింగ్ మేకర్లుగా అవతరించిన విషయం తెలిసిందే. అరబ్ నేతృ త్వంలోని జాయింట్ లిస్ట్‌కు 11 సీట్లు రాగా మన్సూర్ అబ్బాస్ నేతృ త్వంలోని రామ్‌కు ఎనిమిది స్థానాలు లభించాయి. ఈ రెండు పార్టీలు తాజాగా ఐసెన్‌కోట్‌కు మద్దతు తెలిపాయి. ఇదే విషయాన్ని దేశాధ్యక్షుడు ఐజాక్ హెర్జోజ్‌కు అధికారికంగా తెలియజేశాయి. నెతన్యాహూను అధికారానికి దూరం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని జాయింట్ లిస్ట్ నేత యూసుఫ్ జబారిన్ తేల్చి చెప్పారు. అయితే అరబ్ పార్టీలు ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచే మద్దతు ఇస్తారు. అంటే ఐసెన్‌కోట్ నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాయి. ఈ పరిణామం నెతన్యాహూ కూటమికి గట్టి ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఆయన నేతృత్వంలోని కూటమికి పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 53 సీట్లు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. సైనికుల నియామక చట్టంపై తలెత్తిన వివాదం కారణంగా నెతన్యాహూ కూటమిలోని ‘దెగెల్ హాటోరా’ పార్టీ కూడా ఆయనకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్