- ఆహ్వాన కమిటీ చైర్మన్ జూలకంటి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్
- ఎంబి భవన్లో పోస్టరావిష్కరణ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : నల్లగొండలోని ఎన్జి కళాశాల ప్రాంగణంలో ఈ నెల 15న జరిగే అఖిల భారత కిసాన్ సభ మహాప్రదర్శన, బహిరంగ సభకు రైతులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని, 15 నుంచి 18 వరకు జరిగే 36వ మహాసభను జయప్రదం చేయాలని ఆహ్వాన కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్లో బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...15న జరిగే బహిరంగ సభకు మాజీ ఎంపి బృందాకరత్, ఎఐకెఎస్ అఖిల భారత అధ్యక్షులు అశోక్ దావలే, ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్, పలువురు రైతు సంఘాల నేతలు హాజరవుతారని తెలిపారు. బహిరంగ సభ సందర్భంగా నల్లగొండలో మహాప్రదర్శన నిర్వహిస్తున్నామని, అందులో రెడ్‌షర్టు వలంటీర్ల కవాతు, సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. 15వ తేదీ సాయంత్రం నుంచి 18 వరకు ప్రతినిధుల సభ జరుగుతుందని చెప్పారు. 14న ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి 200 స్టాళ్లతో ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టరావిష్కరణలో ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి వెంకట్, రైతు సంఘం కోశాధికారి ఎం శోభన్, ప్రజాసంఘాల ప్రతినిధులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, ఆర్ వెంకట్రాములు, జె వెంకటేశ్, ఉడత రవీందర్, టి స్కైలాబ్‌బాబు, పి ఆశయ్య, ఆర్ శ్రీరాంనాయక్, లెల్లెల బాలకృష్ణ, కట్టనర్సింహ, కోట రమేశ్, ఎ వెంకటేశ్, టి నాగరాజు, విజయ్, వంగూరు రాములు, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)