సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జమ్ము మార్కెట్‌లో అగ్నిప్రమాదం..40 షాపులు దగ్ధం

2 గంటల క్రితం

Jammu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 12:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్‌ : జమ్మూ రైల్వేస్టేషన్‌ సమీపంలో మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 40 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయని అధికారులు సోమవారం తెలిపారు. ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుందని అన్నారు. ఆదివారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో శివ్‌ మార్కెట్‌లో ప్రమాదం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అన్నారు. సుమారు ఐదుగంటల పాటు మంటలు విధ్వంసం సృష్టించాయని అన్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని, గాలి బలంగా వీచడంతో మార్కెట్‌ అంతటా వేగంగా వ్యాప్తి చెందాయని అన్నారు. మార్కెట్‌ సముదాయానికి చేరుకునేందుకు, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారని, తెల్లవారుజామున 3.15గంటలకు మంటలు అదులోకి వచ్చాయని అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్