ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అజిత్‌పవార్‌ మరణంతోనే ముగిసిన విలీన చర్చలు

7 గంటల క్రితం

అజిత్‌పవార్‌ మరణంతోనే ముగిసిన విలీన చర్చలు 
- సుప్రియా సూలే image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 09:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సుప్రియా సూలే

ముంబయి : మహారాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా చర్చనీయాంశమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) రెండు గ్రూపుల విలీనానికి తెరపడింది. ఈ అంశంపై ఎన్‌సిపి (శరద్‌పవార్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపి సుప్రియా సూలే శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. తన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ జీవించి ఉన్నంతవరకే రెండు గ్రూపుల విలీనంపై చర్చలు జరిగాయని, ఆయన మరణంతో ఆ చర్చలకు పూర్తిగా ముగింపు పడిందని ఆమె స్పష్టం చేశారు. ఇదే అంశంపై శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ శరద్​ పవార్ నాయకత్వంలోని పార్టీయే అసలైన ఎన్​సిపి అని పేర్కొన్నారు. మరో వర్గం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీకి చెందినదన్నారు. మరోవైపు విలీనంపై తమ పార్టీలో ఎలాంటి సంప్రదింపులు జరగడం లేదని మహారాష్ట్ర ఎన్​సిపి అధ్యక్షులు సునీల్‌ తట్కరే కూడా ప్రకటించారు. తాము ఎన్​డిఎలో ఉన్నామని, భవిష్యత్తులోనూ అదే కూటమిలో కొనసాగుతామని పేర్కొన్నారు. దీంతో రెండు గ్రూపులు ఒక్కటవుతాయన్న ఊహాగానాలకు తెరపడింది. అజిత్‌ పవార్‌ ఈ ఏడాది జనవరి 28న విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఆ తర్వాత ఆయన నేతృత్వలోని ఎన్‌సిపి గ్రూపు భవిష్యత్‌ రాజకీయ వ్యూహాలపై చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రెండు ఎన్‌సిపి గ్రూపుల విలీనం అంశాలు తెరపైకి వచ్చాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్