బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కుల్గాంలో ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు జవాన్లకు గాయాలు

2 గంటల క్రితం

jk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగుర్గు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కుల్గాం జిల్లాలోని ఒక తనిఖీ కేంద్రం వద్ద మోహరించిన భద్రతా బలగాలపై మోటార్‌ సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు సిఆర్‌పిఎఫ్‌ డిజి జి.పి.సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడినుండి పారిపోయారని అన్నారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని చెప్పారు. గాయపడిన సిబ్బందిని అనంతనాగ్‌ జిల్లాలోని ఆస్పత్రికి తరలించామని, నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని అన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్