సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Mumbai - నవంబరు 25 వరకు రాకెట్లు, ఆకాశంలో పేలే టపాసుల పై నిషేధం

4 గంటల క్రితం

Mumbai Ban on rockets and aerial fireworks until November 25
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 05:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : దీపావళి వేడుకల సందర్భంగా ... ముంబయి నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో ముంబయి నగర పాలక సంస్థ (బీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో రాకెట్లు, ఆకాశంలోకి ఎగిరి పేలే బాణసంచా వినియోగంపై నిషేధం విధించింది. నవంబరు 9 నుంచి 25వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించింది.


బీఎంసీ పరిధిలోని నివాస భవనాలు, వాటి పైకప్పులు, బాల్కనీలు, మురికివాడల్లో ఈ నిషేధం వర్తించనుంది. రాకెట్లు, ఆకాశంలో పేలే బాణసంచా మినహా ఇతర సాధారణ టపాసుల వినియోగంపై గతంలో ఉన్న చట్టాలు, న్యాయస్థానాల మార్గదర్శకాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు అదనపు మున్సిపల్ కమిషనర్ ప్రాజక్తా వర్మ-లవాంగరే ఉత్తర్వులు జారీ చేశారు. రాకెట్లు ఇళ్ల బాల్కనీలు, కిటికీలు, ఇతర ప్రాంతాల్లో పడటం వల్ల మంటలు చెలరేగి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అధిక జనసాంద్రత, ఎత్తైన భవనాలు, ఇరుకైన రహదారులు కలిగిన ముంబయిలో ఇటువంటి ఘటనలు ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.


పౌరులు పండుగను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని, నివాస ప్రాంతాల్లో బాణసంచా కాల్చకుండా జాగ్రత్తలు పాటించాలని ముంబయి మేయర్ రీతు తవ్డే కోరారు. రాకెట్ల కారణంగా ఇళ్లలో అగ్నిప్రమాదాలు సృష్టించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. కాగా ... దీపావళి రాత్రి ముంబయి లో సంభవించిన మూడు భారీ అగ్నిప్రమాదాల్లో అనేక గుడిసెలు, దుకాణాలు, ఓ గ్యారేజీతో పాటు వాణిజ్య భవనంలోని కొన్ని భాగాలు కాలిపోయాయి. ఈ ఘటనల నేపథ్యంలోనే బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్