ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. బుధవారం తెల్లవారుజామున 3.48 గంటల సమయంలో ముంబయి తూర్పు శివారులోని కుర్లా ప్రాంతంలో ఈఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, మరో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, సుమారు 50 మంది బృహన్‌ముంబయి మునిసిపల్ కార్పోరేషన్ (బిఎంసి) సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సుమారు 6నుండి 8మంది కొండచరియల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని డిజిపి తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అన్నారు.
ముంబయిలో విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురు మృతి
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 04:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)