గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరోహింగ్యాలపై మయన్మార్ మారణహోమం చేసింది

14 గంటల క్రితం

ss11-1795094084.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐసిజె చారిత్రక తీర్పు

  • శరణార్థులు సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని ఆదేశం

ది హేగ్‌: మయన్మార్‌లోని రోహింగ్యా మైనారిటీలపై మారణహోమం జరిగిందని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) తీర్పునిచ్చింది. 2017లో మయన్మార్‌ సైన్యం చేపట్టిన అణచివేతలో వేలాది మంది హతమయ్యారని, మహిళలు, పిల్లలపై తీవ్ర హింసకు పాల్పడ్డారని కోర్టు పేర్కొంది. ఈ చర్యల వెనుక రోహింగ్యా జనాభాను నాశనం చేయాలనే ఉద్దేశం ఉందని ఐసిజె స్పష్టం చేసింది. హింస కారణంగా తరలిపోయిన రోహింగ్యాలు తమ నివాస ప్రాంతాలకు సురక్షితంగా, స్వచ్ఛందంగా, గౌరవప్రదంగా తిరిగివెళ్లేందుకు మయన్మార్‌ అనుమతిం చాలని కోర్టు ఆదేశించింది. మారణహోమానికి పాల్పడినట్లు అనుమానితులపై దర్యాప్తు చేసి, బాధ్యులను శిక్షించాలని కూడా పేర్కొంది. బాధితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది. బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌ శరణార్థి శిబిరంలో తీర్పును వీక్షించిన రోహింగ్యాలు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ తీర్పుతో మయన్మార్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశముంది. అలాగే, బ్రిటన్‌ ఆ దేశ రక్షణ అటాచీని బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. అయితే ఐసిజె తీర్పులను అమలు చేయించే ప్రత్యక్ష వ్యవస్థ కోర్టుకు లేకపోవడంతో, మయన్మార్‌ ఆదేశాలను పాటిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్