గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మిక హక్కుల పరిరక్షణకు 21న దేశవ్యాప్త ఆందోళనలు

4 గంటల క్రితం

B. Venkat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 10:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎఐఎడ‌బ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : కార్మిక హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్‌ 1 నుంచి 3వ తేదీ వరకు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించనున్న పార్లమెంట్‌ మార్చ్‌కు మద్దతుగా నవంబర్‌ 21న దేశవ్యాప్తంగా వ్యవసాయ, గ్రామీణ కార్మికులు ఆందోళనలు నిర్వహించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడ‌బ్ల్యుయు) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ పిలుపునిచ్చారు. గురువారం నాడిక్క‌డ ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఉపాధి హామీ పనుల వద్ద, వ్యవసాయ క్షేత్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి కార్మికుల డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్ల ద్వారా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తోందని విమర్శించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమ్మె హక్కులపై దాడి చేస్తోందన్నారు. ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం కల్పించాలని, నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేసి పాత 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. కార్పొరేట్‌ అనుకూల విధానాలు, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాడాలని వెంకట్‌ పిలుపునిచ్చారు. డిసెంబర్ 1-3 తేదీల్లో జరిగే పార్లమెంట్‌ మార్చ్‌లో వ్యవసాయ, గ్రామీణ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్