సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరు రాష్ర్టాలకు నూతన గవర్నర్లు

4 గంటల క్రితం

six
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 12:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- రాష్ర్టపతి భవన్‌ ప్రకటన

న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లో గవర్నర్లను మారుస్తూ రాష్ర్టపతి ద్రౌపది ముర్ము సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను రాష్ర్టపతి భవన్‌ ఒక ప్రకటనలో

తెలిపింది. కేరళంతో పాటు తమిళనాడుకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేంద్ర అర్లేకర్ ను తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌‌గా నియమించారు. సిక్కిం గవర్నర్‌గా పనిచేస్తున్న ఓపీ మాథుర్ కేరళం గవర్నర్‌గా ఎంపిక చేశారు. కర్ణాటక గవర్నర్‌గా సుధా యాదవ్‌‌ను, ఒడిషా గవర్నర్‌‌గా బ్రజ్ మోహన్ రామ్‌ను, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ధల్ సింగ్ బిసెన్‌ను నియమించారు. బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్రపతిభవన్‌ ‌తన ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త గవర్నర్ల పదవీకాలం వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే అమల్లోకి వస్తుందని ఈ ప్రకటన తెలిపింది. అయితే వీరు ఎప్పుడు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారో ఆ తేదీని మాత్రం పేర్కొనలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్