ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AI - ఓహ్ .. దిస్ ఈజ్ ఎఐ మిస్టేక్ ..!

15 గంటల క్రితం

Oh... this is an AI mistake...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 11:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : ఎంత అత్యాధునిక సాంకేతికత అయినా... ఎఐ (AI) కూడా అప్పుడప్పుడు ‘అయ్యో... పొరపాటైపోయింది !’ అనిపించేలా పనిచేస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఇందుకు చక్కని ఉదాహరణ.


ఈ నెల 15వ తేదీన బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి మొబైల్‌ కు ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ఈ-చలానా మెసేజ్‌ వచ్చింది. “ బైక్‌పై వెళుతున్నప్పుడు వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్‌ ధరించలేదు. ఇందుకు రూ.500 జరిమానా చెల్లించాలి ” అనేది ఆ మెసేజ్‌ సారాంశం. అంతే... ‘వెనుక కూర్చున్న వ్యక్తి ఎవరు ? ’ అని ఆ బైకర్‌ ఆశ్చర్యపోయాడు. వెంటనే చలానాకు జత చేసిన ఫొటోను జూమ్‌ చేసి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతడే షాక్‌ అయ్యాడు ! బైక్‌పై వెనుక ఎవరూ లేరు. మరి హెల్మెట్‌ లేని వ్యక్తి ఎక్కడున్నాడు ? తీరా చూస్తే... తన వీపుపై తగిలించుకున్న గిటార్‌ బ్యాగ్‌నే ఎఐ కెమెరా మనిషిగా గుర్తించింది ! అంతేకాదు, ఆ బ్యాగ్‌కు హెల్మెట్‌ లేదని భావించి ఏకంగా ట్రాఫిక్‌ కేసు కూడా నమోదు చేసింది. ఎఐ పొరపాటును గుర్తించిన బైకర్‌ బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులను సంప్రదించాడు. అయితే, ఈ సమస్యపై ‘ఆటోమేషన్‌ పబ్లిక్‌ బెంగళూరు సిటీ పోలీస్‌’ విభాగానికి మెయిల్‌ చేయాలని వారు సూచించారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా... గిటార్‌ బ్యాగ్‌కూ హెల్మెట్‌ పెట్టాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ‘ఎఐ’కి కూడా ఒకసారి రీచెక్‌ అవసరమే కదా !


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్