ముంబయి : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చేపట్టిన ఆపరేషన్ టైగర్ పూర్తయింది. ఉద్దవ్‌ఠాక్రే శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే)కి చెందిన ఆరుగురు ఎంపీలు సోమవారం షిండే గ్రూపులోకి చేరారు. తన పార్టీలోకి చేరిన ఈ ఎంపీలను షిండే స్వాగతించారు. వారిని క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులుగా, రాష్ట్రానికి చెందిన నిజమైన "ధురంధరులు" (దిగ్గజాలు)గా ఆయన అభివర్ణించారు.
కాగా, శివసేన (యుబిటి)కి చెందిన ఆరుగురు ఎంపీలు నగేష్ పాటిల్ అస్తికర్ ( హింగోలి), ఓంప్రకాష్ నింబాల్కర్ (ఉస్మానాబాద్), సంజయ్ దిన పాటిల్ (ముంబై నార్త్-ఈస్ట్), సంజయ్ దేశ్‌ముఖ్ (యవత్మాల్-వాషిమ్), సంజయ్ జాదవ్ (పర్భానీ), భౌసాహెబ్ వాక్‌చౌరే (షిర్డీ) షిండే శివసేన గ్రూపులోకి మారారు. ఈ ఎంపీలు షిండే వర్గంలోకి మారడంతో లోక్‌సభలో ఉద్ధవ్ సేన ఎంపీల సంఖ్యల మూడుకి పడిపోయింది. షిండే వర్గం ఎంపీల సంఖ్య 13కి పెరిగింది.








కామెంట్‌లు (0)