శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిల్లల కంటే తల్లిదండ్రులే పిన్నవయస్కులు

3 గంటల క్రితం

పిల్లల కంటే తల్లిదండ్రులే పిన్నవయస్కులు
-కర్ణాటక ఎస్‌ఐఆర్‌‌లో చిత్రవిచిత్రాలు
- 17 వేలకు పైగా ఓటర్ల వివరాల్లో ఇవే తప్పులు
- ది హిందూ విశ్లేషణలో వెలుగులోకి వచ్చిన వైనం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 08:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

-కర్ణాటక ఎస్‌ఐఆర్‌‌లో చిత్రవిచిత్రాలు

- 17 వేలకు పైగా ఓటర్ల వివరాల్లో ఇవే తప్పులు

- ది హిందూ విశ్లేషణలో వెలుగులోకి వచ్చిన వైనం

బెంగళూరు: కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ‌ప్రక్రియ హాస్యాస్పదంగా మారింది. ఎస్‌ఐఆర్‌ ‌తుది జాబితా పరిశీలిస్తే..చిత్ర, విచిత్రాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో అత్యంత విస్మయం గొలుపుతున్న అంశం..సదరు జాబితాలో ఓటర్లుగా ఉన్న తల్లిదండ్రుల వయసు అదే జాబితాలోని వారి పిల్లల వయసు కంటే తక్కువ వయస్సుతో నమోదు కావడం. ఇలా ఏదో ఒకరు ఇద్దరి విషయంలో కాదు..ఏకంగా 17 వేలకు పైగా ఓటర్ల విషయంలో ఈ వ్యత్యాసాలు బయటపడటం ఎస్‌ఐఆర్‌ డొల్లతనానికి అద్దం పడుతోంది. కొందరు ఓటర్ల విషయంలో అయితే తల్లిదండ్రులు తమ పిల్లల కంటే ఏకంగా 15 సంవత్సరాల తక్కువ వయసుతో ఉన్నారు. కర్ణాటక ఎస్‌ఐఆర్‌ ‌జాబితాపై ప్రముఖ వార్తా సంస్థ ‘ద హిందూ’ విశ్లేషణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 17 వేలకు పైగా నమోదులను కనుగొంది. ఒక ఓటరు వయసు 50 ఏళ్లుగా నమోదు చేయగా..సదరు ఓటరు కుమారుడైన మరో ఓటరు వయసు 70 ఏళ్ల అని నమోదు చేశారు. ఇంకో ఓటరు వయసు 40 ఏళ్లు అని పేర్కొనగా..అదే వ్యక్తికి కుమారిడిగా పేర్కొన్న ఓటరు వయసు కూడా 40 ఏళ్లే అని పేర్కొన్నారు. ఇలాంటి వింతలు రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకున్నాయని ద హిందూ గుర్తించింది. రాయచూర్, కలబురగి, యాద్గిర్‌ జిల్లాల్లో ఇలాంటివి అధికంగా నమోదయ్యాయి. రాయచూర్‌లో 1,960 ఉండగా, కలబురగిలో 1,700కు పైగా ఉన్నాయి. దాదాపు 2,200 నమోదుల్లో తండ్రి వయస్సు ఆయన బిడ్డ వయస్సు కంటే "ఒకటి నుండి ఐదు సంవత్సరాలు తక్కువ"గా ఉంది. వెల్లడైంది. ఉదాహరణకు, కలబురగిలో జేవార్గి అసెంబ్లీ నియోజకవర్గంలో బరమన్న వయస్సు 45గా నమోదు కాగా, అతని కుమారుడు గుండప్ప వయస్సు మాత్రం 50గా ఉంది. ఒకే చిరునామాలో వీరి ఓట్లు ఉన్నాయి. అలాగే, మరో 5,100 నమోదులో పిల్లల కంటే తల్లిదండ్రుల వయస్సు ఆరు నుండి పది సంవత్సరాల వరకూ తక్కువ వయస్సు ఉంది. మరో 3,000 నమోదుల్లో ఇది ఒకటి నుండి ఐదు సంవత్సరాల వరకూ తక్కువ ఉందని ' ది హిందూ' గుర్తించింది. ఈ విషయం ఎన్నికల అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఇలా వయసుతో పాటు వివిధ కారణాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల మందికి పైగా ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులు, వాటికి వివరణల ప్రక్రియ ముగిసిన తర్వాత విడుదల చేసిన తుది ఎస్‌ఐఆర్‌ ‌జాబితాలోనూ అవే లోపాలు పునారావృతం కావడం ఎస్‌ఐఆర్‌ ‌లోపభూయిష్ట విధానాలను తేటతెల్లం చేస్తోంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్