న్యూఢిల్లీ : ఆకాశవాణి భవన్ సమీపంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. సిజెపి పిలుపునిచ్చిన నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్ వెళుతున్న ఆందోళనకారులను ఆకాశవాణిభవన్ సమీపంలోని ఇంతియాజ్ అలీ నగర్‌లో పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. సుమారు 30మంది నిరసనకారులు బారికేడ్లను దాటేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారని, కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయని అన్నారు. మరోవైపు జంతర్‌మంతర్ చేరుకునేందుకు యత్నించిన సుమారు 500మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా బలగాలను తప్పించుకుని, వివిధ ప్రాంతాల నుండి తిరిగి జంతర్‌మంతర్ చేరుకునేందుకు యత్నించిన ని రసనకారులను వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.








కామెంట్‌లు (0)