ముంబయి : జాతిపిత మహాత్మాగాంధీ మనవడు, ‘హమ్ భారత్ కే లోగ్’ అధ్యక్షుడు తుషార్ గాంధీ సహా ఆయన కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో సిజెపి చేపడుతున్న నిరసనకు మద్దతుగా ఆయన ఆగస్ట్ క్రాంతి మైదాన్‌కు చేరుకునేందుకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆయనను బాంద్రాలోని లింకింగ్ రోడ్‌లో అదుపులోకి తీసుకుని డి.ఎన్.నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని అన్నారు.
‘‘శాంతా క్రూజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని నేషనల్ కాలేజ్ కూడలి వద్ద ముంబై పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి, గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకువెళ్తున్నారు. ముంబై పోలీస్ జిందాబాద్. అరెస్టు చేసి డిఎన్ నగర్‌కు తీసుకువచ్చారు. లోక్ షాహీ జిందాబాద్!. నన్ను అరెస్టు చేసినప్పటికీ ఆగస్ట్ క్రాంతి మైదాన్ నిరసన కొనసాగుతుంది. చలో ఆగస్ట్ క్రాంతి మైదాన్! డిఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో ఉంచారు,” అని తుషార్ గాంధీ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)