mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దళితులు, గిరిజనుల హక్కులకై దేశవ్యాప్త ఉద్యమం

7 గంటల క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 02:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

బి.వెంకట్, అండ్ర మాల్యాద్రి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దళితులు, గిరిజనుల హక్కులకై దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని ఎఐఎడబ్ల్యూయు జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. గురువారం నాడిక్కడ వారు మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా దళిత, గిరిజన హక్కులను హరిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాల మద్దతుతో దళిత గిరిజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలులాంటి దారుణాలకు ఆధిపత్య కులాలు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మోడీ, బాబు, పవన్, జగన్, రేవంత్ రెడ్డిలకు దళితులు, గిరిజనులు ఓట్ల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తారా? అభివృద్ధిలో గుర్తుకు రారా?’ అని ప్రశ్నించారు. అంటరానితనం, అసమానతలతో ఏ దేశమైనా ముందుకు పోయిందా? వసుధైవ కుటుంబమంటే అదానీ, అంబానీ లాంటి ఆధిపత్య కులాలేనా? అని నిలదీశారు. భూమి, ఉపాధి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు, అంటరానితనం నిర్మూలన, బ్యాక్‌లాగ్ పోస్టులు నింపటం, సంపదలో వాటా, రాజ్యాంగ పరిరక్షణ కోసం గ్రామ స్థాయి నుండి "మార్చ్ టు పార్లమెంట్" వరకు విశాల వేదికలు నిర్మించి ఐక్య ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాలతో కులనిర్మూలన కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు.


రఘురామ చర్యలు దుర్మార్గం

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తన నియోజకవర్గం ఉండిలో 70 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న దళితులు, పేదలకు చెందిన రెండు వేలపైగా ఇళ్లను బుల్‌డోజర్లతో అక్రమంగా కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు. “దళితుల ఓట్లు అవసరం లేదని దాడులు చేస్తున్నారు. దళిత దేవత గొంతెనమ్మ గుడిని తొలగించి రామాలయం పేరుతో దళితులపై దాడులు చేస్తున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడటం లేదు. ఇది దుర్మార్గం” అని విమర్శించారు. దళిత, గిరిజనులను పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పిన పాలకులు ఆరేళ్ల నుండి వారికి సబ్సిడీలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అన్నారు. సామాజిక సమస్యలపై క్షేత్రస్థాయి నుండి పరిశీలన చేసి కులవివక్ష రూపాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్