న్యూఢిల్లీ : రాజస్తాన్‌లోని కోటా జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. కోటా-ఉదయ్‌పూర్ రహదారిపై శంభుపుర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఖాటూ శ్యామ్ సందర్శన ముగించుకుని మహారాష్ట్రకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అదనపు జిల్లా కలెక్టర్ తెలిపారు. వాహనంలో ఉన్నవారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని అన్నారు. శంభుపుర సమీపంలో, 16మంది ప్రయాణిస్తున్న వాహనం అర్థరాత్రి వేళ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం .. తొమ్మిది మంది మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 22, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)