ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మార్పు కోసం ....

1 గంట క్రితం

For change
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 12:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మార్పు మళ్ళీ పదునెక్కిందా?

చరిత్రకు కొత్త పేజీ జోడిస్తోందా?

అవునవుననే అనిపిస్తోంది

రాజరికంపై కదం తొక్కిన కరెన్సీ

వడి వడి అడుగుల సవ్వడితో

మార్కెట్ వెలుగుల జిలుగులతో

పెట్టిన పరుగు గాడి తప్పినపుడు

సమతకు సమాజం పురుడోసింది

నవతను శ్రమజనం పూరించింది

​

కంగారెత్తిన కరెన్సీ సమాజమూ

సోషలిస్టు తరహా పాటే ఎత్తెంది

ఆ దారీ ఉక్కపోతను ఆపలేదు

పట్టిన చెమటను తుడవడానికి

ప్రపంచ మేథో యజ్ఞం చేసింది

కావలిసిందీ పోగు పడాల్సిందీ

కష్టం దోచిన సొత్తు గుట్టయితే

దేశీయ పెట్టుబడి కోటలేలంది

ప్రపంచమే ఏకకరెన్సీ కట్టయితే

కన్జూమరిజం మెరుపు గుట్టయితే

'సమత'లో ప్రజలే మార్కెట్టుకు చేరి

నవతకు చప్పట్లు చరచకుందరా

అన్న గీతాలు కొత్త రాతలు రాశాయి

కరెన్సీ గానాలతో ఉర్రూతలూపాయి

​

ఏళ్ళూ పూళ్ళూ గడిచిపోయాక

జెన్ జీలు కళ్ళు తెరిచి చూశారు

కొత్త కొలువులెత్తని ప్రపంచ కరెన్సీ

మోపే భారాల బరువు లాగలేక

ప్రగతికి నెత్తుటి గాయాలయ్యాక

'సమత'లో చేజారిన మమతల

లెక్క తప్పిన రీతులు చూసింది

దేశదేశాల్లో పిడికెళ్ళైత్తి కదలింది

మళ్ళీ మార్పు గానం చేసింది

మహోద్యమాలకు తెర లేపింది

సమాజ మార్పుకు అడుగేస్తోంది

​

ఉన్నం వెంకటేశ్వర్లు,

87900 68814

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్