బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అత్యాచార బాధితురాలిని
గర్భాన్ని కొనసాగించాలని కోరలేం : ఢిల్లీ హైకోర్టు

7 గంటల క్రితం

delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 07:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలు గర్భం దాల్చడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన బాధితురాలిని ఆ గర్భాన్ని కొనసాగించాల్సిందిగా బలవంతం చేయడమనేది ఆమె గౌరవంగా జీవించే హక్కును తీవ్రంగా దెబ్బతీయడమే అవుతుందని అభిప్రాయపడింది. 30 వారాలు దాటిన తన గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి కోరుతూ 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, బాధితురాలు తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిస్తూ జస్టిస్ మధు జైన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. లైంగిక దాడి కేసులలో, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటిపి) చట్టం ప్రకారం గర్భం చట్టబద్ధమైన పరిమితిని దాటిందన్న విషయాన్ని విడిగా పరిగణించలేమని జస్టిస్ మధు జైన్ ఈ నెల 8వ తేదీ నాటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. '15 ఏళ్ల బాలికను కేవలం తల్లిగా పరిగణించలేము' అని, మైనర్ యొక్క శ్రేయస్సు, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. బాధితురాలి ఇష్టానికి వ్యతిరేకంగా మాతృత్వ బాధ్యతను ఆమెపై మోపడం సరికాదన్నారు. "ఇదొక దురదృష్టకరమైన, బాధాకరమైన కేసు. బాధితురాలి గర్భం దాల్చిన కాలం చట్టపరమైన పరిమితిని దాటిందన్న వాస్తవాన్ని మాత్రమే విడిగా చూడలేం. అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన బాధితురాలిని ఆ గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మాతృత్వ బాధ్యతను మోపడమనేది గౌరవంగా జీవించే ఆమె హక్కుకు తీవ్రమైన భంగం కలిగించడమే అవుతుంది. గర్భం దాల్చిన బాధితురాలిని ప్రసవించమని బలవంతం చేయడం ఆమెను మరింత దీర్ఘకాలిక శారీరక, మానసిక క్షోభకు గురిచేయవచ్చు" అని జస్టిస్‌ ‌మధు జైన్‌ ‌తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్