న్యూఢిల్లీ : 2020 అల్లర్ల కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త షార్జిల్ ఇమామ్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించడంలో విఫలమైందని, అత్యున్నత న్యాయస్థానం విధించిన ఏడాది కాలపు నిషేధం ముగిసే దశలో ఉందని, దీంతో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇమామ్ కోరారు. సాక్షులను విచారించడంలో అధికారులు విఫలమయ్యారని, అత్యున్నత న్యాయస్థానం విధించిన ఏడాది కాలం నిషేధం ముగియనుందని, దీంతో తనకు బెయిల్ జారీ చేయాలని ఇమామ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2020, సెప్టెంబర్ 25న ఛార్జ్ షీట్ దాఖలు చేశారని, ఇందులో 18 మంది నిందితులు విచారణను ఎదుర్కొంటున్నారని, అలాగే ప్రాసిక్యూషన్ 47 మంది రక్షణ కల్పించబడిన సాక్షులతో సహా మొత్తం 900 మందికి పైగా సాక్షులను పేర్కొందని ఆ పిటిషన్‌లో వాదించారు. తాను ఆరు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు విచారణ ఖైదీగా ఉన్నప్పటికీ, ప్రాసిక్యూషన్ కనీసం ఒక్క సాక్షిని కూడా విచారించలేదని ఇమామ్ పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక ఉన్న "భారీ కుట్ర"కు సంబంధించి, ఉపా చట్టం కింద నమోదైన కేసులో జెఎన్‌యు మాజీ నేత ఉమర్ ఖలిద్, ఇమామ్‌లకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 30న నిరాకరించింది.
ఢిల్లీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు షార్జిల్ ఇమామ్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026, 06:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)