ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నాలుగంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి

1 రోజు క్రితం

Six dead after four-storey building collapses.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 10:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

భివండీ (మహారాష్ట్ర) : మహారాష్ట్రలోని భివండీలో నాలుగంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి చెందగా, శిథిలాల కింద పలువురు చిక్కుకున్న ఘటన గురువారం జరిగింది. ప్రమాదం జరిగిన భవనంలో ఒక్కో అంతస్తులో 12 చొప్పున మొత్తం 48 గదులు ఉన్నాయి. నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో, అందులోని వారంతా శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు పలువురిని రక్షించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో పగుళ్లు ఏర్పడడంతో.. దానిని ఖాళీ చేయాల్సిందిగా అక్కడి వారికి ఇది వరకే సూచించినట్లు మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ వారు ఖాళీ చేయకుండా అనధికారికంగా మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులేనని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్