సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్‌ నిరసనకారులపై కేసుల ఉపసంహరణకు రాష్ట్రాలకు స్వేచ్ఛ : సుప్రీం

9 గంటల క్రితం

నీట్‌ నిరసనకారులపై కేసుల ఉపసంహరణకు రాష్ట్రాలకు స్వేచ్ఛ : సుప్రీం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 04:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నీట్‌ ప్రశ్నా పత్రం లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా నమోదైన కేసులను చట్ట ప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జులై 20న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 'క్రిమినల్‌ యాంటిసిడెంట్స్‌' అనే పదం హత్య, అత్యాచారం, ఉగ్రవాదం వంటి తీవ్రమైన నేరాలకు మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. చిన్నచిన్న కేసులను ఆ కోవలో పరిగణించకూడదు అని స్పష్టం చేసింది. నిరసనలకు సంబంధించిన అంశాలపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కోర్టు తెలిపింది. పెల్లెట్‌ తుపాకుల వినియోగంపై సమగ్ర మార్గదర్శకాలు రూపొందిస్తామని, ఎలాంటి పరిస్థితుల్లో వాటిని ఉపయోగించవచ్చో నిర్దేశిస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను ఆగస్టు 19 కు వాయిదా వేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్