న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీసుకురాబోయే ఈ బిల్లుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీలకు ఆయన సూచనలు చేశారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నేత అయినా భావి తరాలకు, చరిత్రకు ద్రోహులుగా మిగిలిపోతారని రాహుల్ గాంధీ ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన రాజకీయ కుట్ర అని రాహుల్ గాంధీ విమర్శించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను, ప్రజల ప్రాతినిధ్య హక్కులను దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు. "ఈ బిల్లు వెనుక ఉన్న కుట్రను గ్రహించి ప్రతిపక్షాలు ఒక్కటి కావాలి. ఎలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం డీలిమిటేషను మద్దతు ఇచ్చినా, వారు ప్రజల దృష్టిలో, చరిత్ర పుటల్లో 'ద్రోహులు'గానే మిగిలిపోతారు" అని హెచ్చరించారు. కాంగ్రెస్‌తో పాటు దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు సభలో ఈ బిల్లును ఓడించేందుకు కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారు : రాహుల్ గాంధీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 01:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)