ఉమరియా (మధ్యప్రదేశ్) : పులి పంజా విసిరింది... గేదెలన్నీ ఒక్కటై తమ కాపారిని కాపాడుకున్నాయి.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లా పరిధిలో ఉన్న బాంధవ్‌గఢ్ పులుల అభయారణ్యంలో జరిగింది. గత బుధవారం అడవిలో తప్పిపోయిన తన రెండు గేదెల కోసం వెదుకుతున్న రామ్‌నరేశ్ సింగ్ (36) పై ఓ ఆడపులి దాడి చేసింది. పంజా విసిరి అతడి చేతిని తీవ్రంగా గాయపరిచిన పులి ... అతడిని పొదలమాటుకు లాక్కొని వెళ్లే ప్రయత్నం చేసింది. ఇంతటితో తన జీవితం ముగిసిపోయిందని బెంబేలు పడిపోయిన రామ్‌నరేశ్‌కు అనూహ్యమైన సాయం లభించింది. యజమానిని లాక్కెళుతున్న పులిపైకి అమాంతం దాడి చేసిన గేదెలు తీవ్రంగా పోరాటం చేశాయి. గేదెలన్నీ ఒక్కటై ఆ పులిని అడవిలోకి తరిమికొట్టాయి. గాయంతో స్పృహ లేకుండా పడున్న రామ్‌నరేశ్ ను ఇతర పశువుల కాపరులు గుర్తించగా, అటవీ అధికారులు ఆసుపత్రికి తరలించారు. గురువారం నాటికి కోలుకొన్న బాధితుడు ‘‘నా గేదెలే నా ప్రాణాన్ని కాపాడాయి’’ అన్నారు. రామ్‌నరేశ్ కు తక్షణ ఆర్థిక సాయం అందించినట్లు అభయారణ్యం క్షేత్రస్థాయి డైరెక్టరు అనుపమ్ సహాయ్ తెలిపారు.
పులి పంజా .. కాపరిని కాపాడుకున్న గేదెలు..!
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 10:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)