శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌టివికె ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నేశ్‌ అరెస్టు

2 గంటల క్రితం

‌టివికె ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నేశ్‌ అరెస్టు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నయ్‌ : మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపిన కేసులో తమిళనాడు అధికార పార్టీ టివికె ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ అరెస్టయ్యారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఐఎఎస్‌ అధికారిణి మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా శుక్రవారం ఎమ్మెల్యేని అరెస్టు చేశారు. ఓ మహిళా కలెక్టర్ సెల్‌ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపినట్లు కళ్లకురిచ్చి అరుళ్ విఘ్నేశ్‌పై ఆరోపణలు వచ్చాయి. మద్యం మత్తులో ఆమె నివాసానికి వెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో అన్నా‌డిఎంకెకు చెందిన ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరిగిందని మద్రాస్ హైకోర్టు విజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలతో అరుళ్ విఘ్నేశ్‌పై కళ్లకురిచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐజి ఎన్ కామిని పర్యవేక్షణలో తిరుప్పూర్ ఎస్పీ సృష్టి సింగ్ దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 25న విఘ్నేశ్‌కు సమన్లు కూడా జారీ చేశారు. అయితే ఐఎఎస్‌ అధికారిణి ఆరోపణలను ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ ఖండించారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్