శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్క్రాప్‌ గోదాములో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

21 అక్టోబర్, 2026

Mumbai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 03:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : మహారాష్ట్రలోని స్క్రాప్‌ మెటీరియల్‌ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అంథేరీ ఈస్ట్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మంటలధాటికి సుమారు 70 వాణిజ్య సముదాయాలు, నివాస భవనాలు దగ్ధమయ్యాయని బృహన్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ (బిఎంసి) ఒక ప్రకటనలో తెలిపింది. వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 6.00గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదస్థాయి లెవల్‌-2కి చేరుకోవడంతో, ముంబయి ఫైర్‌ బ్రిగేడ్‌ (ఎంఎఫ్‌బి) అదనపు బలగాలను మోహరించింది. మంటలను అదు పులోకి తీసుకువచ్చేందుకు ఆరుగంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని అన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారని, వారిని గుర్తించాల్సి వుందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుందని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్