ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం : పుతిన్‌

15 గంటల క్రితం

War with Ukraine caused by NATO expansion and interference by European nations: Putin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 05:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

New Delhi : నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఢిల్లీ వేదికగా శనివారం బ్రిక్స్ దేశాల వార్షిక సదస్సు అధికారికంగా ప్రారంభమైంది. మొత్తం 11 సభ్య దేశాధినేతలు హాజరయ్యారు. భారత ప్రధాని మోడి సహా చైనా, రష్యా, ఇరాన్, సౌతాఫ్రికా అధ్యక్షులు జిన్‌పింగ్, పుతిన్, పెజెష్కియాన్, రామఫోసా పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా .... రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఎప్పుడూ ఐరోపా దేశాలను బెదిరించలేదని, భవిష్యత్తులోనూ అలా చేయబోదని స్పష్టం చేశారు. అయితే తమ దేశ ప్రయోజనాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోందని పుతిన్‌ ఆరోపించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రపంచ దేశాల ఇంధన, ఆహార భద్రతకు సహకరించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. బ్రిక్స్‌ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రపంచ దేశాలతో కలిసి పనిచేయడానికి మాస్కో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్