కోల్కతాలో వామపక్ష విద్యార్థి సంఘాల కవాతు
కాలేజ్ స్ట్రీట్ పుస్తకాల విక్రయాలపై ఎబివిపి దౌర్జన్యకాండపై ఆగ్రహం
కోల్ కతా : కాషాయ మూకల ఆటలు సాగనివ్వబోమంటూ కోల్కతాలో వామపక్ష విద్యార్థి సంఘాలు కవాతు నిర్వహించాయి. మూడ్రోజుల క్రితం కలకత్తా విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణం సమీపంలోని తమ పుస్తకాల దుకాణంపై ఎబివిపి బాంబు దాడిని నిరసిస్తూ శనివారం ఉత్తర కోల్కతాలో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఓ ప్రదర్శనలో పాల్గొన్నాయి. నగరంలోని పుస్తకాల విక్రయ కేంద్రమైన కాలేజ్ స్ట్రీట్ వరకు, హెడూవా నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ ప్రదర్శన సాగింది. ఈ ప్రదర్శనలో చాలామంది పుస్తకాలను చేతపట్టుకోగా, పశ్చిమ బెంగాల్లో విద్య, సంస్కృతి పరిరక్షణకు పిలుపునిస్తూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ స్వేచ్ఛగా చదివే హక్కును కాపాడటమే ఈ ప్రదర్శన ఉద్దేశమని తెలిపారు. సిపిఎం రాజ్యసభ మాజీ సభ్యుడు బికాష్ రంజన్ భట్టాచార్య ఈ ప్రదర్శనలో సంఘీభావంగా పాల్గొన్నారు.








కామెంట్లు (0)