సింధు, అన్మోల్ ఖర్బ్ కూడా...
హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సార్‌బ్రూకెన్(జర్మనీ): హైలో ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి పివి సింధు, అన్మోల్ ఖర్బ్‌తోపాటు పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 2వ సీడ్ సింధు వరుససెట్లలో డెన్మార్క్ షట్లర్‌ను చిత్తుచేయగా.. అన్మోల్ ఖర్బ్ మూడుసెట్ల హోరాహోరీ పోరులో భారత్‌కే చెందిన 6వ సీడ్ ఉన్నతి హుడాపై సంచలన విజయం నమోదు చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ గేమ్‌లో అన్మోల్ 21-17, 18-21, 21-16తో ఉన్నతిని చిత్తుచేసి సెమీస్‌కు చేరింది. ఇక పివి సింధు 21-12, 21-10తో డెన్మార్క్‌కు చెందిన అన్‌సీడెడ్ స్వాట్ఛ్‌ను చిత్తుచేసింది. ఇక పురుషుల సింగిల్స్‌లో మూడుసెట్ల హోరాహోరీ పోరులో లక్ష్య సేన్ ఫిన్లాండ్‌కు చెందిన అన్‌సీడెడ్ కోల్జెనన్‌ను చిత్తుచేశాడు. తొలి సెట్‌ను లక్ష్య సేన్ 14-21తో చేజార్చుకున్నా.. ఆ తర్వాత రెండు సెట్లను 21-17, 21-13తో గెలిచి సెమీస్‌కు చేరాడు. ప్రీ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ మూడుసెట్ల హోరాహోరీ పోరులో భారత్‌కే చెందిన కిరణ్ జార్జిని ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.








కామెంట్‌లు (0)