నాలుగు వికెట్ల తేడాతో నెగ్గిన పాకిస్తాన్
హాంకాంగ్: హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్‌లో గ్రూప్ లీగ్ తొలి మ్యాచ్‌లో భారతజట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. గ్రూప్-సిలో భాగంగా శుక్రవారం పాకిస్తాన్‌తో తలపడిన భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టిన్ క్వోంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్ టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 88 పరుగులే చేసింది. శశాంక్ సింగ్(40), నితీశ్ రాణా(19) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. కెప్టెన్ కృనాల్ పాండ్యాతో పాటు రాహుల్ త్రిపాఠి, రాహుల్ తేవాటియా నిరాశపరిచారు. అనంతరం పాకిస్తాన్ 3.5ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. దీంతో ఈ గ్రూప్‌లో పాకిస్తాన్, యుఎఇ 2 పాయింట్లతో టాప్-2లో ఉండగా... భారతజట్టు చివరి గ్రూప్ లీగ్‌లో యుఎఇతో శనివారం తలపడనుంది.








కామెంట్‌లు (0)