- ఆధార్ ఆధారంగా తీసుకోం
- కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్
న్యూఢిల్లీ : పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించడానికి, చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి, బయోమెట్రిక్ ధ్రువీకరణతోపాటు ఓటర్ గుర్తింపు కార్డులు ప్రాతిపదికగా ఉంటాయని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి, జెడి (యు) నాయకుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లల్లన్ సింగ్ అన్నారు. గ్యాంగ్‌టక్‌లోని సిక్కిం కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. “ప్రస్తుతం లబ్ధిదారులకు చెల్లింపులకు ఆధార్ ప్రాతిపదికగా ఉంది, ఇకపై దానిని ప్రాథమిక గుర్తింపు సాధనంగా పరిగణించరు,” అని సింగ్ అన్నారు. ఆధార్‌కార్డు ప్రతి వీధి మూలలో కూడా తయారు చేయవచ్చని, తద్వారా మోసపూరిత లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని అన్నారు. ఓటర్ గుర్తింపు కార్డు ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల "మోసపూరిత నమోదులను" తొలగించి, సంక్షేమ పథకాలు "అర్హులైన" లబ్ధిదారులకు అందేలా చూడవచ్చని చెప్పారు. పదహారో ఆర్థిక సంఘం, 2026-31 అవార్డు కాలానికి, 2.55 లక్షల పంచాయతీలు, స్థానిక సంస్థలకు రూ.4,35,236 కోట్ల గ్రాంట్లను సిఫార్సు చేసింది.








కామెంట్లు (0)