న్యూఢిల్లీ : ఫ్లై దుబాయ్ విమానంలో తలెత్తిన అనూహ్య ఘటనలో ధైర్య సాహసాలను, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల్లో ముంచెత్తారు. భారత పైలట్ తీసుకున్న చర్యలతో 9/11 దాడుల స్థాయిలోని మరో విషాదం నివారించబడిందని పేర్కొంటూ ఆయన అభినందించారు. ప్రస్తుతం దుబాయ్‌లో చికిత్స తీసుకుంటున్న కెప్టెన్ స్మిత్‌తో మోడీ వీడియో కాల్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కెప్టెన్‌ని చూసి 140 కోట్ల మంది భారతీయులూ అభినందిస్తున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారని చెప్పారు. అనంతరం మోడీ ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అత్యున్నత స్థాయి ధైర్యాన్ని మచ్చర్ ప్రపంచానికి ప్రదర్శించారని మోడీ పేర్కొన్నారు. తన ప్రాణాలు సైతం ముప్పులో వున్నా దాన్ని లెక్కచేయకుండా విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడడమే ధ్వేయంగా వ్యవహరించారని ప్రశంసించారు. దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళుతున్న విమానంలో కో పైలట్ దాడి చేయడంతో మచ్చర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే గాయాలతోనే విమానాన్ని నియంత్రించి ప్రయాణీకుల ప్రాణాలను కాపాడారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ
02 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026, 10:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)