- 33 లక్షల మంది ఓటర్లుకు నోటీసులు
- ఇప్పుడు వేగంగా పరిష్కారం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎస్ఐఆర్ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా 33 లక్షల మందికి చిన్ని చిన్న కారణాలతో నోటీసులు జారీ చేసిన ఇప్పుడు వాటిని వేగంగా పరిష్కరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. అర్హులనే ఓటర్లనే అనుమానించి నోటీసులు జారీ చేశారని, కాబట్టే నోటీసులను తొలగిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో ఎస్ఐఆర్ ప్రక్రియంలో భాగంగా నోటీసులు జారీ చేసిన 33 లక్షల మంది ఓటర్లలో, సుమారు 60 శాతం ఓటర్లను, అంటే దాదాపు 20 లక్షల మందిని ఓటర్లుగా ధృవీకరించినట్లు ఎన్నికల అధికారులు తాజాగా తెలిపారు. కేవలం గత రెండు వారాల్లోనే ఏకంగా 19 లక్షల కేసులను అధికారులు పరిశీలించడం గమనార్హం. తార్కిక వ్యత్యాసాల కారణంతోనూ లేదా 2002 జాబితాలో తమ పేర్లు నమోదు కాకపోవడం.. వంటి కారణాలతో 33 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 31న ప్రచురించిన 97.5 లక్షల పేర్లతో ఉన్న ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ ఓటర్లనూ చేర్చారు. కానీ అదనపు పరిశీలన తరువాతనే వీరినితుది ఓటర్ల జాబితాలో కొనసాగింపు నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఈ పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ) అశోక్ కుమార్ కార్యాలయం నుండి వచ్చిన తాజా మౌఖిక ఆదేశాలతో నోటీసుల పరిష్కార రేటులో ఆకస్మిక పెరుగుదల కనిపించింది. ఆగస్టు 31న ఈ పరిష్కార ప్రక్రియ ప్రారంభమైనా సెప్టెంబర్ 26 నాటికి కేవలం 96,000 కేసులను మాత్రమే పరిశీలించిచారు. ఈ నెల 5న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో 10 లక్షలకు పైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. దీనికి వారం తరువాత అంటే ఈ నెల 12న విడుదల చేసిన ప్రకటనలో "ఇప్పటికే 33 లక్షల కేసులలో సుమారు 20 లక్షల కేసులు పరిష్కరించాం" అని తెలిపింది. అలాగే, ఎవరికైనా ఇంకా ఏవైనా ఫిర్యాదులు ఉంటే బిఎల్ఓలు, ఎఇఆర్ఓలు, ఇఆర్ఓలు, డిఇఓలు, సిఇఓల్లో ఎవరినైనా సంప్రదించవచ్చుననని కూడా ఈ ప్రకటనలో పేర్కొనడం విశేషం. ఈ నోటీసులను పరిష్కరించడానికి చివరి తేదీ నవంబర్ 30గా ఉన్నప్పటికీ పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి, వచ్చే వారంలోనే అన్ని కేసులను క్లియర్ చేయాలని అశోక్ కుమార్ అధికారులకు సూచించారు.








కామెంట్లు (0)