ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికా లాబీయింగ్‌ సంస్థతో మోడీ ప్రభుత్వం ఒప్పందం

09 నవంబర్, 2026

lbui
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నెలకు రూ. 70 లక్షల ఫీజు

న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా లాబీయింగ్‌ సంస్థ మెర్క్యురీ పబ్లిక్‌ అఫైర్స్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వివాదాస్పదమైంది. ఈ సంస్థలో పనిచేసే కీలక వ్యక్తులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సంబంధాలున్నాయి. వివిధ అంశాలప అమెరికాలో లాబీయింగ్‌ చేయడానికి ఈ సంస్థకు నెలకు సుమారు రూ.70 లక్షల ఫీజు చెల్లించడానికి మోడీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ట్రంప్‌-మోడీల సోషల్‌ మీడియా పోస్టులకు, ఈ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి ముడి పెడుతూ మీడియాలో వార్తలొచ్చాయి. భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మోడీని అభినందిస్తూ ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పెట్టిన పోస్టును కూడా ఈ సంస్థే నిర్వహించింది. అమెరికా విదేశీ ఏజెంట్ల రిజిస్ట్రేషన్‌ చట్టం (ఫరా) కింద దాఖలు చేసిన డిస్‌క్లోజర్స్‌ ఈ విషయాలను వెల్లడించాయి. అయితే ఈ వార్తలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. అమెరికాలో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు లాబీయింగ్‌ సంస్థలను నియమించుకోవడం 1948 నుంచి వస్తున్న సాధారణ పద్ధతేనని సమర్థించుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్