శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆహారభద్రత ఇంకా పూర్తిగా రాలేదు

7 గంటల క్రితం

arr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ వ్యాఖ్య

న్యూఢిల్లీ : వివిధ ఆహార ఉత్పత్తుల సరఫరా విషయంలో భారత్​ బహుశా ఇప్పటికీ పూర్తి భద్రతను సాధించలేదని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అశోక్ కుమార్ లాహిరి శుక్రవారం పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారత్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, భారత్​ తన వంట నూనెల అవసరాల్లో సగానికి పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోందని చెప్పారు. ఈ దిగుమతులు సుమారు 17 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్నాయని, వీటి విలువ దాదాపు 20 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్