బీహార్ : బీహార్‌లోని సుపౌల్ జిల్లాలో వైరల్ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలోకి అకస్మాత్తుగా వచ్చిన పెద్ద మొసలిని ఏమాత్రం భయం లేకుండా బంధించి, తన భుజాలపై మోసుకుంటూ నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లాడు. గ్రామస్తులు తీసిన ఈ విచిత్ర దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... సుపౌల్ పరిధిలోని వరి పొలంలో కొందరు రైతులు పనుల్లో ఉండగా.. నీటిలో భారీ మొసలి కొట్టుకు రావడం చూసి, పొలంలో పనిచేస్తున్న కూలీలు భయంతో పరుగెత్తారు. అయితే, ఆ మొసలికి ఎలాంటి హాని తలపెట్టకుండా, ఊరి ప్రజలకు ప్రమాదం రాకుండా చూడాలని భావించిన అమిత్ కుమార్ అనే రైతు.. ముందుగా దగ్గర్లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసుకు వెళ్లి విషయాన్ని తెలియజేసాడు. అయితే అక్కడ ఆఫీసర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తానే చాకచక్యంగా దాన్ని బంధించి, నోటిని తాళ్లతో గట్టిగా కట్టేశాడు. అనంతరం దాన్ని అటవీశాఖకు అప్పగించేందుకు ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోవడంతో.. అమిత్ ఏమాత్రం వెనుకాడకుండా దాదాపు 5 అడుగుల పొడవున్న ఆ మొసలిని స్వయంగా తన భుజాన వేసుకుని పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరాడు. రైతు ధైర్యసాహసాలను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, మొసలిని తమ ఆధీనంలోకి తీసుకుని, అటవీశాఖ అధికారుల సహాయంతో సమీపంలోని నదిలో సురక్షితంగా విడిచిపెట్టారు.
మొసలిని భుజాన మోస్తూ ... పోలీస్ స్టేషన్‌కు నడిచిన యువ రైతు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 04:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)