mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'విశాఖ ఉక్కు' మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించాలి

09 జూన్, 2026

nara
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 10:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యతవహించి, మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించి, గాయపడినవారు కోలుకొనే వరకు అత్యున్నతమైన నిపుణుల వైద్యబృందంతో వైద్యసేవలందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖ ఎలిజి పాలిమర్స్ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చినట్లే, స్టీల్ ప్లాంట్ కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలు చెల్లించాలన్నారు.ప్రమాదంలో గాయపడి సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను, కెజిహెచ్ పోస్టుమార్టం వద్ద మృతుల కుటుంబాలను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ కె ఎస్ వి కుమార్, డాక్టర్ బి గంగారావు, పి మణి, వి కృష్ణారావు, బి జగన్ , జిల్లా నాయకులు బొట్టా ఈశ్వరమ్మ, ఎం. సుబ్బారావుతో కలిసి ఆయన మంగళవారం పరామర్శించారు. 




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్