ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కనీస వేతనాలకై చలో కలెక్టరేట్

1 రోజు క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 06:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : 'అంగన్‌వాడీ, ఆశా, ఎండిఎం, విఓఏ, ఆర్‌పీలు, స్కూల్ స్వీపర్స్, సమగ్రశిక్ష, నేషనల్‌హెల్త్ మిషన్, ఉపాధిహామీ, వెలుగు తదితర స్కీం వర్కర్లకు కనీస వేతనాలు రూ.26,000/`లు ఇవ్వాలని, సామాజిక భద్రతా సౌకర్యాలైన పెన్షన్, పిఎఫ్, ఇఎసఐ, గ్రాట్యూటీ తదితర సౌకర్యాలు అమలు చేయాలని, అంగన్‌వాడీలకు నవచేతన యాప్ రద్దు చేయాలని, ఆశా వర్కర్ల పనిభారం తగ్గించాలని, మధ్యాహ్నా భోజన కార్మికుల ఉపాధికి దెబ్బతీసే స్మార్ట్ కిచెన్లు రద్దుచేయాలని, విఓఏ, ఆర్‌పి, స్కూల్ స్వీపర్స్‌కు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లా కలెక్టరేట్ల దగ్గర పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్కీం వర్కర్ల ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న స్కీం వర్కర్లను, సిఐటియు నాయకత్వాన్ని పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడాన్ని, గాయపర్చడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు.




సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్