నరసరావుపేటలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్రోసూరు, సత్తెనపల్లి, ముప్పాళ్ల నుంచి జడ్పీటీసీ నామినేషన్ వేసేందుకు వచ్చిన సీపీఎం అభ్యర్థులను కొందరు అడ్డుకున్నారు. వారి నామినేషన్ పత్రాలను చించివేశారు. దీంతో కమ్యూనిస్టులు అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. అయితే కాసేపటికి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ భద్రత కల్పించడంతో.. మరో సెట్ నామినేషన్ పత్రాలతో వారు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లారు.
పల్నాడులో సిపియం అభ్యర్ధుల నామినేషన్ పత్రాల చించివేత
22 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 02:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)