జకార్తా : నడిసంద్రంలో నౌకలో మంటలు చెలరేగడంతో ఐదుగురు మరణించారు. 41మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. తూర్పు జావాలోని సురబయ నుండి దక్షిణ సులవేసిలోని మకాస్సర్‌కు ప్రయాణిస్తుండగా నౌకలో మంటలు చెలరేగాయి. నౌక ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికేమంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 271మంది ఉన్నారు. కొందరు నుండి సముద్రంలోకి దూకారని, 41మంది గల్లంతయ్యారని నేషనల్ సర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ (బాసార్నాస్) అధికారులు తెలిపారు. నౌక నుండి మొత్తం 225మందిని కాపాడామని అన్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
నడిసంద్రంలో నౌకలో మంటలు ..ఐదుగురు మృతి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 05:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)