న్యూ ఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే తొలగించాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణను నిలిపివేయాలని, అన్యాయంగా మినహాయించబడిన వారందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ... న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ప్రదర్శన ర్యాలీ జరిగింది. శాంతియుతంగా ప్రదర్శన చేస్తుండగా ... పోలీసులు అడ్డుకున్నారు. సీనియర్ సిపిఐ(ఎం) నాయకురాలు బృందా కరత్, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తలతో పాటు పలువురు నేతలను ఢిల్లీ పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. అనంతరం... పోలీసు వ్యాన్ లోపల నుంచి సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఈ విధంగా మాట్లాడారు.
Video - జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్య కసాయి : ఎం.ఎ.బేబీ
02 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)