ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గంటలతరబడి పడిగాపులు.. విమానం రద్దు.. - మహిళ నిరసన

14 ఆగస్టు, 2026

Hours of waiting... flight cancelled... - Woman protests
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

భువనేశ్వర్ : భువనేశ్వర్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం రద్దవడంతో ఓ ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం 2:35 గంటలకు భువనేశ్వర్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూశారు. అయితే అధికారులు ప్రయాణీకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సాయంత్రం 5:30 గంటలకు విమానం రద్దయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ వద్దకు వెళ్లాల్సి ఉందని, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. CISF సిబ్బంది జోక్యం చేసుకుని ఆమెను సముదాయించారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్