mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నవ్వకుండా చూడటం అసాధ్యం : సిఎం చంద్రబాబు పోస్టు

11 గంటల క్రితం

Impossible not to laugh: CM Chandrababu's post
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 12:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎఐ ఫోటోలు, వీడియోలు, గ్రాఫిక్స్, చార్టులు ఒకటేమిటీ అన్నీ ... అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.. ఎఐ లేకుండా ఏవీ జరగలేని రోజులు మరి ..! ఈ క్రమంలో సిఎం చంద్రబాబు ఒక ఎఐ వీడియోని తన X ఖాతాలో పోస్ట్ చేయడం వైరలయ్యింది. ఆ వీడియోని గమనిస్తే.. అందులో చంద్రబాబు.. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. అది ఫన్ కాదు.. కానీ కలెక్టర్ సీటులో ఒక చిన్ని పాప ఉండటం హైలెట్ అంశం. ఆ పాప (ఆర్నా) కలెక్టర్ అయ్యి.. చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్లుగా ఈ వీడియోని క్రియేట్ చేయడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ వీడియోకు కనెక్ట్ అయ్యారు. " నవ్వకుండా ఈ వీడియోని చూడటం అసాధ్యం. నేను అధికారికంగా ఆర్నాకి మద్దతు ఇస్తున్నాను " అని క్యాప్షన్ ఇచ్చిన చంద్రబాబు.. స్మైలీ ఇమోజీని పోస్ట్ చేశారు. ఈ వీడియో నిమిషాల్లోనే వేల కొద్దీ వ్యూస్ పొందింది. ఈ వీడియో పోస్టుపై నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. "చంద్రబాబు తన సొంత మీమ్ పోస్ట్ చేశారు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "ఇన్నేళ్లుగా మీ నుంచి మిస్సైంది ఇదే. దూసుకెళ్లండి.. వెనక్కి చూడొద్దు" అని మరో యూజర్ స్పందించారు. వీడియో బాగుందని మరికొందరు కామెంట్స్ ఇచ్చారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్