ఆనందపురం: విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ భూ సమస్యలపై రైతులను కలిసేందుకు వెళ్తున్న సీపీఎం, సీపీఐ తదితర వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు సోమవారం మార్గమధ్యంలో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్లివాడలో సమావేశం నిర్వహించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. నాయకులను స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై వామపక్ష నాయకులు పోలీసుల చర్యను ఖండిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
తర్లువాడకు వెళ్తున్న వామపక్ష నేతల అరెస్ట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 12:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)