సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యాయం కోసం .... గిరిజన గురుకుల ఉపాధ్యాయుల ధర్నా

14 జులై, 2026

Tribal Residential School Teachers Stage Protest for Justice
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

టిడిపి కూటమి ప్రభుత్వం తమ ఉద్యోగాలను తొలగించిందని, తమకు న్యాయం చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్రంలోని గిరిజన గురుకుల ఉపాధ్యాయులు ఉద్యమించారు. తాడేపల్లి బైపాస్ రోడ్‌లోని గిరిజన గురుకులం ప్రధాన కార్యాలయం వద్ద గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నాకు దిగారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు ఉపాధ్యాయులను బలవంతంగా అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు, మహిళా పోలీసులు ఆందోళనాకారులను చెల్లాచెదురు చేసి 29 మందిని అరెస్ట్ చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్