అర్దసెంచరీ, నాలుగు వికెట్లతో రాణించిన ఆల్‌రౌండర్
తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై
ఆరు వికెట్ల తేడాతో గెలుపు
బర్మింగ్‌హామ్: టి20 సిరీస్‌లో విఫలమైన టీమిండియా బౌలర్లు వన్డేల్లో సత్తా చాటారు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లకు తోడు అర్ధసెంచరీతో రాణించి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తొలుత భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లండ్ జట్టు 47.5ఓవర్లలో 258పరుగులకే పరిమితమైంది. ఆ లక్ష్యాన్ని భారతజట్టు 45.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(80రిటైర్డ్ హార్ట్)కి తోడు అక్షర్ పటేల్(57నాటౌట్), సుందర్(45నాటౌట్)కి తోడు శ్రేయస్ అయ్యర్(35) బ్యాటింగ్‌లో రాణించారు. కెప్టెన్ గిల్ 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(5), కెఎల్ రాహుల్(1) నిరాశపరిచారు. హ్యారీ బ్రూక్ మెరుపు త్రోకు శ్రేయాస్ అయ్యర్(35) రనౌట్ కాగా.. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే జోష్ టంగ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్(1) బౌల్డయ్యాడు.
అంతకుముందు అంతకుముందు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్(2/61), ప్రసిధ్ కృష్ణ(2/50)లు ఒకే ఓవర్లో రెండేసి వికెట్లతో పడగొట్టి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బతీసారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ డకెట్(43) రాణించినా.. బేథెల్, బ్రూక్, బట్లర్, సామ్ కర్రన్ స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరారు. ఈ క్రమంలో 80 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆతిథ్య జట్టును రూట్, డాసన్ అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. జో రూట్(76 నాటౌట్)కి తోడు లియాం డాసన్(68) ఏడో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నారు. శతక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీని అక్షర్ విడదీ శాడు. డాసన్‌తో పాటు టెయిలెండర్లను డగౌట్ చేర్చడంలో అక్షర్ పటేల్ కీలకపాత్ర పోషించాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 258 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా బౌలర్లు అక్షర్ పటేల్‌కు నాలుగు, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణకు రెండేసి, బుమ్రా, దూబేకు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు...
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: డకెట్ (సి)బుమ్రా (బి)గుర్నూర్ బ్రార్ 43, బేథెల్ (సి)సుందర్ (బి)గుర్నూర్ బ్రార్ 14, రూట్ (నాటౌట్) 76, హారీ బ్రూక్ (సి)రోహిత్ (బి)బుమ్రా 1, బట్లర్ (సి)గుర్నూర్ బ్రార్ (బి)ప్రసిధ్ కృష్ణ 5, సామ్ కర్రన్ (సి)కెఎల్ రాహుల్ (బి)ప్రసిధ్ కృష్ణ 0, విల్ జాక్స్ (సి)కెఎల్ రాహుల్ (బి)దూబే 20, డాసన్ (సి)రోహిత్ (బి)అక్షర్ 68, ఆర్చర్ (సి)సుందర్ (బి)అక్షర్ 12, రషీద్ (స్టంప్)కెఎల్ రాహుల్ (బి)అక్షర్ 1, టంగ్ (బి)అక్షర్ 0, అదనం 18. (47.5ఓవర్లలో ఆలౌట్) 258పరుగులు.
వికెట్ల పతనం: 1/61, 2/63, 3/64, 4/80, 5/80, 6/107, 7/228, 8/250, 9/258, 10/258 బౌలింగ్: బుమ్రా 9-0-31-1, ప్రసిధ్ కృష్ణ 10-2-50-2, గుర్నూర్ బ్రార్ 9-0-61-2, దూబే 6-0-27-1, సుందర్ 4-0-13-0, అక్షర్ పటేల్ 9.5-0-62-4.
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) బ్రూక్ (బి)సామ్ కర్రన్ 11, శుభ్‌మన్ (రిటైర్డ్ హర్ట్ 80, కోహ్లి (ఎల్‌బి)ఆర్చర్ 5, శ్రేయస్ అయ్యర్ (రనౌట్) హ్యారీ బ్రూక్ 35, సుందర్ (నాటౌట్) 52, కెఎల్ రాహుల్ (బి)టంగ్ 1, అక్షర్ పటేల్ (నాటౌట్) 57, అదనం 21. (45.2ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 262పరుగులు.
వికెట్ల పతనం: 1/43, 2/48, 3/157, 4/160.
బౌలింగ్: ఆర్చర్ 10-0-60-1, టంగ్ 10-0-50-1, సామ్ కర్రన్ 10-0-55-1, ఆదిల్ రషీద్ 5.2-0-34-0, బేథెల్ 1-0-10-0, డాసన్ 2-0-10-0, విల్ జాక్స్ 7-0-43-0.







కామెంట్‌లు (0)